23 March, 2026 | 1:23 PM

నీటి గుంతలో పడి విద్యార్థి మృతి

23-03-2026 12:00 AM

సికింద్రాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధి లో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంత లో పడి మైనర్ విద్యార్థి మృతి చెందాడు. తిరుమలగిరి ఇన్స్పెక్టర్ జి.నాగరాజు తెలిపిన వివరాలు. యూసుఫ్ గూడ  కు చెందిన సీబీఎస్‌ఈ టెన్త్ చదివిన రిత్విక్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు ఇంటర్ ఫస్ట్  ఇయర్ చదువుతున్న విద్యార్థులు కలిసి తోటి స్నేహితురాల్ని కలవడానికి శనివారం యూసుఫ్ గూడా నుండి తిరుమలగిరికి వచ్చారు.

తోటి స్నేహితురాలు, ముగ్గురు కలిసి సరదాగా రెస్టా రెంట్‌లో  స్నాక్స్  తిన్న తర్వాత తిరుమలగిరి పీఎస్ పరిధిలోని అమ్ముగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని  కోహి ఇమాం దర్గా కొండపైకి ఎక్కారు. అక్కడే ఉన్న ఓ టెంపుల్ లో దైవదర్శనం చేసుకొని, అక్కడే కొంత సేపు గడిపి సాయంత్రం తిరిగి కిందికి వచ్చేటపుడు గుట్ట మద్యలో  కాలు జారి పక్కనే ఉన్న నీటిగుంతలో దొర్లుకుంటూ వచ్చి రిత్విక్ రెడ్డి (15) పడిపోయాడు.

మిగితా తోటి ముగ్గురు ఫ్రెం డ్స్ పరిగెత్తి అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. దాంతో  గాయాల తో రిత్విక్‌రెడ్డి అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయాడు. ఈ ఘటనపై తిరుమలగిరి పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.