23 March, 2026 | 10:22 AM

ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి

23-03-2026 12:00 AM

ఎమ్మెల్సీ దండే విఠల్

కుమ్రం భీం అసిఫాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన తాటినగర్ గ్రామ సర్పంచ్ తత్కర్ అనిల్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సి మాట్లాడుతూ గ్రామా ల్లో మౌలిక వసతులు మెరుగుపడి గ్రామా లు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందని అన్నారు. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సర్పంచ్ అనిల్ తెలిపారు.

అనంతరం తాటినగర్ గ్రామానికి చెందిన దొంగ్రే శంకర్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.60 వేల విలువైన సహాయనిధి చెక్కును అందజేశారు. సీఎం సహాయని ధి పథకం పేద ప్రజలకు ఆపద సమయంలో ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడం గణపతి, కౌటాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నికాడే గంగారం, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దుర్గం జానకిరామ్, డబ్బుల వెంకన్న,నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.