పాముకాటుతో విద్యార్థి మృతి
31-07-2026 02:13 AM
అయిజ, జూలై 30: అయిజ మండలం వెంకటాపురం గ్రామంలో పాముకాటుతో 14 ఏళ్ల వి ద్యార్థి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కుర్వ తిమ్మప్ప, జయలక్ష్మి దంపతుల రెండో కుమారుడు కే. తిరుమలేష్ (8వ తరగతి) బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూ లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థి మృతితో కు టుంబంలో విషాదం నెలకొనగా, గ్రామం లో విషాదచాయలు అలుముకున్నాయి.






