4 June, 2026 | 1:16 AM

కట్నం వేధింపుల కేసులో భర్తకు ఏడాది జైలు

04-06-2026 12:31 AM

సిద్దిపేట క్రైం, జూన్ 3 : అదనపు కట్నం కేసులో ఓ భర్తకు ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ సిద్దిపేట జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది. సిద్దిపేటకు చెందిన కొత్వాల్ లహరిక అనే వివాహిత... తన భర్త సందీప్ అదనంగా కట్నం కోసం వేధిస్తున్నాడని సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు  విచారణలో నేరం రుజువు కావడంతో సిద్దిపేట ఒకటో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్  తరుణి  నిందితుడుకి ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష , రూ.పది వేల జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా శ్రమించిన పోలీస్ అధికారులు, సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అభినందించారు.