16 April, 2026 | 9:39 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

వెల్దుర్తిలో విద్యార్థిని అదృశ్యం

04-06-2025 12:45 AM

కిడ్నాప్ చేశారని తండ్రి ఫిర్యాదు 

వెల్దుర్తి, జూన్ 3: వెల్దుర్తి మండల  కేంద్రంలో ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన పోతరాజు వెంకటమ్మ, మల్లేశం దంపతులకు 12 ఏళ్ళ కూతురు ఉంది. నాలుగు రోజుల క్రితం దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటానని తండ్రి వద్ద డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిందని తెలిపారు.

బయటకు వెళ్ళిన తన కూతురు తిరిగి ఇంటికి రాకపోవడంతో గ్రామంలో బంధువుల వద్ద వెతికినా ఆచూకి లభించలేదని తండ్రి మల్లేశం వాపోయాడు. అయితే రెండు రోజుల క్రితం తన తమ్ముడికి ఫోన్ చేసి తనను వెల్దుర్తి బస్టాండ్లో ఓ మహిళ తనపై ఏదో మందు చల్లి తీసుకెళ్ళారని చెప్పినట్లు చెప్పారు.

తన కూతురును ఎవరో కిడ్నాప్ చేశారని, తనకు పోలీసులు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. కాగా విద్యార్థిని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి పూర్తి చేసుకుంది.