16 April, 2026 | 8:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అంతర్గత రోడ్ల పనులను త్వరితగతిన చేపట్టాలి

04-06-2025 12:46 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, జూన్ 3 (విజయ క్రాంతి): నియోజకవర్గంలో సమస్యాత్మకమైన రోడ్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి ఉంచామని, వర్షాకాలంలో ప్రధాన అంతర్గత రోడ్ల పనులను త్వరగతిన చేపడుతున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

మంగళవారం రోజున 53వ డివిజన్ విజయగణపతి కాలనీ, మహాత్మా నగర్, హన్మంత రావునగర్ లలో రూ.85 లక్షలతో అలాగే 54వ డివిజన్ సగరకాలనీలో రూ.33 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన 16 నెలలుగా నగరంలో ఉన్న ప్రధాన అంతర్గత రోడ్లను పూర్తి చేసుకున్నామని అన్నారు.

ఎన్నికలలో ఈడివిజన్లలో తిరిగిన తరుణంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు. రెండు డివిజన్లలో ఈ రోజు 1.05 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు, సంబధిత అధికారులు నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.నగర అభివృద్ధి, పరిశుభ్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వం జూన్ 02 నుంచి సెప్టెంబర్ 10 వరకు చేపట్టిన 100 రోజుల అభివృద్ధి ప్రణాళిక, పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం, సహకారం కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.