04-06-2025 12:44:29 AM
మహబూబాబాద్, జూన్ 3 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈరగాని రమ్య చంద్రిక జేఎన్టీయూ లో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో ఎంఎస్సీ పూర్తి చేసి యూనివర్సిటీ టాపర్ గా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది.
ఈ మేరకు యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పతకాన్ని, పీజీ పట్టాను అందుకున్నారు. రమ్యచంద్రిక తండ్రి బిక్షం గౌడ్ మహబూబాబాద్ జిల్లా సాక్షి దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. తమ కుమార్తె రమ్యచంద్రిక యూనివర్సిటీ టాపర్ గా నిలిచి బంగారు పతకాన్ని సాధించడం పట్ల తల్లిదండ్రులు బిక్షం సునీత ఆనందం వ్యక్తం చేశారు. గోల్ మెడల్ సాధించిన రమ్యచంద్రికను జర్నలిస్టులు అభినందించారు.