29 June, 2026 | 12:58 AM

ఆ యాస మాట్లాడితే ఎగతాళి చేశారు!

29-06-2026 12:17 AM

‘నా విభిన్నమైన యాస కార ణంగా క్లాస్‌మేట్స్ ఎగతాళి చేస్తూ ఏడిపించేవారు. ఆ వయసులో అది నన్ను ఎంతో మానసిక వేదనకు గురిచేసింది’ అంటూ తన చిన్ననాటి ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్‌లో ‘సెయాన్’ సినిమాతో పరిచయం కాబోతున్న ఈ బ్యూటీ తెలుగులో అక్కినేని అఖిల్ సరసన ‘లెనిన్’లో నటిస్తోంది.

ఈ సినిమా జూలై ౧౦న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యలో టీమ్‌తో కలిసి ప్రస్తుతం ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది భాగ్యశ్రీ. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన బాల్య సంఘటలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురైంది. “నా బాల్యమంతా నైజీరియాలోని లాగోస్ నగరంలోనే గడిపా. అక్కడి వాతావరణంలో పెరగడం వల్ల ఓ ప్రత్యేకమైన యాస అలవడింది. ఆ తర్వాత భారతదేశానికి వచ్చి పాఠశాలలో చేరా.

అప్పుడు నేను మిగతా పిల్లల కంటే భిన్నంగా మాట్లాడటంతో అందరూ వింతగా చూసేవారు. ఆ అనుభవాలు నన్ను కుంగదీయలేకపోగా, భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారాయి. ఆనాటి సవాళ్లు, చేదు అవమానాలే నా ఆత్మవిశ్వాసాన్ని నా జీవిత ప్రయాణాన్ని తీర్చిదిద్దాయి. ఆ రోజుల్లో పడ్డ కష్టం వల్లే నేను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మరింత దృఢంగా, ధైర్యంగా తయారయ్యా. ఇప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకునే శక్తి ఆ రోజుల్లోనే నాకు లభించింది” అని చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ.