6 May, 2026 | 3:41 PM

కాంగ్రెస్ పాలనలో 49 మంది విద్యార్థులు మృతి

28-11-2024 01:45 AM

బీఆర్‌ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ 

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 49 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్‌ఎస్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పిల్లల చావులకు కార ణం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు.

ఇవి కాంగ్రెస్ చేసిన హత్యలుగా భావిస్తున్నట్టు చెప్పారు. బయటి ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యిందని కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అంటుండటం దారుణమని అన్నారు. విద్యాశాఖ, శాంతి భద్రతలు చూడటానికి మంత్రే లేడ ని.. ముఖ్యమంత్రి వద్ద ఉన్నా ఎందు కు స్పందించడం లేదని ప్రశ్నించారు.