6 May, 2026 | 4:01 PM

పీఏసీఎస్ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ

06-05-2026 03:30 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల పీఏసీఎస్ చైర్మన్ గా పెద్దపోలు సాంబాగౌడ్ బుధ వారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసి పాలక వర్గాలకు కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. తొలగించిన పాలక వర్గాలను యథావిధిగా కొనసాగింపులో భాగంగా తిరిగి అధికారం అప్పగించడంతో బుధవారం  అధ్యక్షుడితోపాటు సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.