6 May, 2026 | 3:50 PM

సింగిల్ విండో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అల్లాడి యాదగిరి రావు

06-05-2026 03:20 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం సింగిల్ విండో చైర్మన్ గా మళ్లి బుధవారం అల్లాడి యాదగిరి రావు బాధ్యతలు స్వీకరించారు.  గత సంవత్సరం 19-12-2025 న పదవి కాలం పూర్తి కావడంతో ప్రభుత్వం ఎలక్షన్ నిర్వహించక వారి పదవులను  రద్దు చేస్తూ జీవో తీశారు. దీంతో వారు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ప్రభుత్వం సింగిల్ విండో ఎన్నికలు నిర్వహించే వరకు లేదా నామినేట్ పోస్టులు భర్తీ చేస్తారా అని ప్రభుత్వాన్ని కోరుతూ అప్పటివరకు  వారికి పాత వారే సింగల్ విండో చైర్మన్ గా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం చైర్మన్ గా  యాదగిరిరావు సింగిల్ విండో కార్యాలయంలో మళ్లీ బాధ్యతలు  స్వీకరించారు. సీఈఓ ప్రసాద్ తో పాటు సిబ్బంది చైర్మన్ యాదగిరిరావుకు శుభాకాంక్షలు తెలిపారు.