calender_icon.png 11 November, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనం వికటించి 17 మంది విద్యార్థులకు అస్వస్థత

11-11-2025 12:00:00 AM

  1. జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో ఘటన.
  2.  విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని 
  3. కలెక్టర్‌ని ఆదేశించిన కేంద్రమంత్రి బండి సంజయ్ 

హుజురాబాద్,నవంబర్10:(విజయ క్రాంతి): మధ్యాహ్న భోజనం వికటించి 9 మంది బాలికలకు 8 మంది బాలురు అస్వస్థతకు గురైన సంఘటన కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజ కవర్గం లోని జమ్మికుంట పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం జమ్మికుంట ప్రభుత్వ పాఠశాల లో సోమవారం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత మొదట ముగ్గురు వంథింగ్ చేసుకున్నారని ఆ తర్వాత మిగతా విద్యార్థులు కడుపు నొస్తుందని చెప్పడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

మధ్యాహ్న భోజనంలో నాసిరకం గుడ్లు పెట్టడం వలన విద్యార్థుల ఆసుపత్రి పాలైనారని అర ఆసుపత్రి పాలైనా రని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ తమ పిల్లలు అస్వస్థకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నరు. హాస్పిటల్ సూపర్నెంట్ శ్రీకాంత్ రెడ్డి ఫుడ్ పాయిజన్ కావ డంతో విద్యార్థులు అస్వస్థకు గురైనలని ఎలాంటి చందన అవసరం లేదని తెలిపారు. 

 విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.

 జమ్మికుంటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అస్వస్థకు గురికాగా విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలెక్టర్ పమేల సత్పతికి టెలిఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకొని వెంటనే అసోసి గురైన విద్యార్థిని, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలనిఆదేశించారు.