ఇందిరా నగర్ జాతర పోస్టర్ల ఆవిష్కరణ
15-03-2026 03:42 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ జాతర ఏప్రిల్ 3న నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థాన ప్రాంగణంలో బెజ్జూర్ శ్రీ రంగనాయక స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్, గ్రామ ప్రజలతో కలిసి ఇందిరానగర్ మహా జాతర పోస్టర్లను ఆవిష్కరించారు. ఏప్రిల్ 3న జరిగే జాతర ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.




