17 June, 2026 | 10:59 AM

Breaking News

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •   అవినీతి తిమింగలం.. నరహరిరావుకు 14 రోజుల రిమాండ్   •   పానీ పూరి తిన్న చిన్నారులు అస్వస్థత.. 10 మందికి పైగా ఆసుపత్రిలో చేరిక   •   పేరుకే ఎమ్మార్సీ భవనం.. వసతులు శూన్యం   •   హామీలు నెరవేర్చకుంటే తిరుగుబాటు తప్పదు   •  

విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలి

11-02-2026 06:02 PM

శంకరాజుపల్లి సర్పంచు దేవులపల్లి విజయ్ కుమార్

ఏటూరునాగారం,(విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడి సెంటర్లలను శంకరాజుపల్లి గ్రామ సర్పంచు దేవులపల్లి విజయ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం పిల్లలకి పోస్టికాహారం సక్రమంగా అందిస్తున్నారా..? లేదా..? అంగన్వాడీ టీచర్లను తెలుసుకున్నారు. అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకి అక్షరాలతో పాటు ప్రభుత్వం నుంచి వస్తున్న బాలామృతం లాంటి పౌస్తికఆహారం అందించాలని చెప్పారు. పిల్లలపట్ల ఏ చిన్న తప్పు జరిగిన సహించేదే లేదు అని హెచ్చరించారు.

అనంతరం శంకరాజుపల్లి పాఠశాలను గ్రామ సర్పంచు దేవులపల్లి విజయ్ కుమార్ సందర్శించి మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండి ఉపాద్యాయులను గౌరవించి వారు బోధించిన పాటాలను శ్రద్దతో విని పోటీ పరిక్షల్లో మంచి మార్కులు సాదించి ఉన్నత విద్యా ను అభ్యసించి ఉన్నతాధికారులుగా కావాలని విద్యార్థులకు సూచించారు. సందర్శించి వారిపట్ల అన్ని సదుపాయాలు సక్రమంగా అందాలని వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొండగొర్ల శ్రీనివాస్ జాడి సత్యనారాయణ, వలస సత్యం (కారోబార్) ఎన్హెఆర్సీ ఏటూరునాగారం మండల అధ్యక్షుడు జాడి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.