10 April, 2026 | 8:55 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలం   •   ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •  

ఓటు హక్కును వినియోగించుకున్న ములుగు జిల్లా కలెక్టర్

11-02-2026 05:58 PM

ములుగు,(విజయక్రాంతి): ములుగు కొత్త మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 14, జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రములో బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నిర్భయంగా ఓటు వేయాలని స్థానిక సుపరిపాలనలో భాగస్వాములు కావాలన్నారు. ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు.

అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంప్స్ నిర్మించడమే కాక వీల్ చైర్స్ ను అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 18 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి పోలింగ్ స్టేషన్ లొ అక్కడి అధికారులకు చూయించి ఓటర్లు తమ ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.