గురుకుల కళాశాల ప్రతిభ
12-04-2026 05:48 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎస్ ఆర్జెసి గురుకుల కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ బైపీసీ విభాగాలు సంధ్యారాణి 990 కీర్తన 991 మార్కులు సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో టీ రాజ్యలక్ష్మి 337, అపర్ణ శ్రీవిద్య నిఖిత 336 మార్కులు సాధించినట్లు తెలిపారు. మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు




