calender_icon.png 13 February, 2026 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడాలకు విద్యార్థుల ఎంపిక

13-02-2026 12:00:00 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): జిల్లా స్థాయిలో జరిగినటువంటి సీఎం కప్ నెట్ బాల్ క్రీడాలో గోపాల్పేట్ జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి బాలికల విభాగంలో ద్వితీయ స్థానం సాధించడం జరిగింది. బాలికల విభాగం నుండి నీలిమ, పవిత్ర, ఎంపిక కాగా, బాలుర విభాగం నుండి  మనోహర్,ఆంజనేయులు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి,పిడి సబత్ కృష్ణ, పాఠశాల బృందం అభినందనలు తెలియజేశారు.