24 August, 2026 | 10:40 PM

Breaking News

నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •  

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి

23-06-2025 11:38 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. సోమవారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలంపిక్ డే రన్(Olympic Day Run) ర్యాలీని కలెక్టరేట్ వద్ద జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థులు చదువుతూ పాటు క్రీడలలో కూడా రాణించాలని అన్నారు.

క్రీడల ద్వారా క్రమశిక్షణతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని, చదువులో ఏకాగ్రత పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు ఆర్థిక ఉన్న క్రీడను ఎంచుకొని చదువుతో పాటు రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఒలంపిక్ డే రన్ ర్యాలీ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్క్, కొమురం భీం చౌక్, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా సర్వీసులు శాఖ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, జిల్లా గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.