calender_icon.png 9 February, 2026 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ పోటీలో విద్యార్థుల ప్రతిభ

09-02-2026 06:49:11 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో మంచిర్యాల విద్యార్థులు పాల్గొని అత్యంత ప్రతిభ పాట వాలను చాటారు. కాసిపేట మండలం సోమగూడెంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే టోర్నమెంట్లో మంచిర్యాల పట్టణానికి చెందిన స్పోర్ట్స్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని పలు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. కాటాస్ విభాగంలో రోహిణి ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. శ్రీమణి కూడా కాటాస్ విభాగంలో ప్రథమ స్థానం సాధించింది.

అండర్-14 విభాగంలో నేహా ప్రథమ స్థానం సాధించి బంగారు పతకాన్ని అందుకుంది. బాలుర విభాగంలో స్పారింగ్ ఈవెంట్లో అయాన్, అద్వైత్, హరీష్, నైతిక్లు ప్రథమ స్థానాలు సాధించి బంగారు పతకాలను గెలుచుకున్నారు. విద్యార్థులకు శిక్షణనిచ్చిన వడ్లకొండ భారతి మాస్టర్ శివమహేష్ మాస్టర్ (జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు) విజేతలను అభినందించారు. స్పోర్ట్స్ కరాటే క్లబ్ స్థాపకులు అట్టెం మధునయ్య విద్యార్థు క్రీడా స్ఫూర్తి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ..విజేతలను  అభినందించారు.