calender_icon.png 9 February, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారతకు మరో ముందడుగు

09-02-2026 06:53:35 PM

గుంజలూరులో స్త్రీ శక్తి భవన్‌కు శంకుస్థాపన

చివ్వెంల: చివ్వెంల మండలంలోని గుంజలూరు గ్రామంలో మహిళల సంక్షేమం, స్వయం ఉపాధి, సాధికారత లక్ష్యంగా స్త్రీ శక్తి భవన్ నిర్మాణానికి సోమవారం గ్రామ సర్పంచ్ బొల్లికొండ సైదులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లికొండ సైదులు మాట్లాడుతూ... “గ్రామంలోని మహిళలు ఆర్థికంగా బలపడాలంటే ఇలాంటి సదుపాయాలు ఎంతో అవసరం. స్త్రీ శక్తి భవన్ ద్వారా మహిళలకు శిక్షణ, సమావేశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది.

మహిళలు తమ హక్కులు తెలుసుకొని స్వతంత్రంగా ఎదగేందుకు ఈ భవన్ ఒక కేంద్రంగా నిలుస్తుంది. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రామస్థాయిలో సమర్థంగా అమలు చేయడమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ రాహుల్, వార్డు సభ్యులు పెదపోలు చందన వీరయ్య గౌడ్, కొనకంచి మల్లయ్య, కొప్పు సైదులు, బొల్లికొండ దుర్గయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సుంకరి గురవయ్య, దొనకొండ వీరయ్య పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ మండల యువజన నాయకులు దొనకొండ మహేష్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు సుంకరి ఉపేందర్ వర్మ, సంగిరెడ్డి లింగారెడ్డి, కొప్పు వీరస్వామి, కొప్పు భద్రాద్రి, యక్కటి శ్యామ్ సుందర్ రెడ్డి, ఐతరాజు రామ్మల్లు, కొనకంచి శ్రీను, పెదపోలు నారాయణ, వడ్లకొండ హరీష్, కొప్పు శ్రీను, సంఘ బంధం లీడర్లు కొనకంచి అంజమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మి, విబికే మయూరి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.