19-02-2026 12:00:00 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్ ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ... విద్యార్థులకు ఇంటర్మీడియట్ కీలక మైన దశ అని, స్టూడెంట్స్ భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
విద్యార్థులు, యువత దుర అలవాట్లకులోను కాకుండా క్రమశి క్షణ తో మెలిగి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, డి ఐ ఈ ఓ కల్పన , ప్రిన్సిపాల్ రామచంద్ర రెడ్డి, హెచ్‌ఎం రత్నాకర్ రెడ్డి, కౌన్సిలర్లు ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.