17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాగ్నిజెంట్ ఫౌండేషన్ టెక్4ఆల్ ఫేజ్-IIశిక్షణ కార్యక్రమం ప్రారంభం

19-02-2026 12:00 AM

ముకరంపుర, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్స్ (జిట్స్)లో ఐసిటి అకాడమీ కాగ్నిజెంట్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టెక్4ఆల్ ఫేజ్‌II సి ఎస్ ఆర్ డేటా అనలిటిక్స్ శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. టె క్4ఆల్ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 65 మంది విద్యార్థినులకు ఆధునిక ఐటీ నైపుణ్యాలు, వృత్తిపరమైన సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ అందించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఐసిటి అకాడ మీ తెలంగాణ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బూరా దినేష్, రిలేషన్షిప్ మేనేజర్ ముకుందర్ నంద్యాల, కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ & కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డా. టి. అనిల్ కుమార్, డీన్ డా. పి.కే. వైశాలి, విభాగాధిపతి డా. ఎం. రవీందర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి. సింధూష, తదితరులు పాల్గొన్నారు.