28 June, 2026 | 12:09 PM

Breaking News

రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •  

ఏవోపై చర్యలు తీసుకోవాలి

19-02-2026 12:00 AM

తాసీల్దార్‌కు వినతి

చిగురుమామిడి, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): చిగురుమామిడి మండలంలోని రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి మల్లేశంపై చర్యలు తీసుకోవాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు పోలోజు సంతోష్ ఆధ్వర్యంలో తాసిల్దార్ రమేష్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. నవాబుపేట గ్రామానికి చెం దిన పిల్లి తిరుపతి రైతు ఆన్లైన్లో యూరియా బస్తాలు బుక్ చేసుకున్నా.. యూరియా బస్తాలు తనకు రాకుండా వేరే వాళ్లకు ఇచ్చారని ఏవోకు ఫోన్ చేశాడని, దీంతో ఏవో మల్లేశం ఇష్టానుసారంగా మాట్లాడి రైతు తిరుపతిని బెదిరించాడని ఆరోపించారు.

వెంటనే ఏవో పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నా రు. వినతి పత్రం అందజేసిన వారిలో రైతు లు పిల్లి తిరుపతి, మహేందర్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్,శ్రీనివాస్,రాజేందర్, అనిల్ తదితరులున్నారు. కాగా, ఫిర్యాదు పై ఏవో మల్లేశంను వివరణ కోరగా రైతు పట్ల ఎలాంటి దుర్భాషలాడలేదని, రైతు సమస్య ను పరిష్కరించే దిశగానే అతనితో సానుకూలంగా మాట్లాడాలని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకే వ్యవసాయ అధికారులు, సిబ్బంది ఉన్నారన్నారు.