calender_icon.png 11 December, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే పోటీల్లో విద్యార్థులకు పతకాలు

08-12-2025 12:46:27 AM

కోదాడ, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): ఖమ్మం పట్టణంలో ఆదివారం సుమన్ ఫోటో ఖాన్ స్పోరట్స్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 30వ నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో కోదాడ పట్టణ శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన స్టూడెంట్స్ కోకో ఖాన్ కరాటే క్లబ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి గోల్ సిల్వర్ బ్రాంచ్ మెడల్స్ కైవసం చేసుకున్నట్లు కోచ్ మాధవి లత ఆదివారం తెలిపారు.

తమ క్లబ్ నుండి నిహార్,నిశాంత్, నోహిత్, గోల్ మెడల్స్ ఈశ్వర్ అంజలి, శిరీష లు గోల్ మెడల్స్, గుణ సాయి విజయ రవళి లు సిల్వర్ మెడల్స్, విక్రాంత్, వెంకట నిహాల్, నికిత బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. విజేతలకు మెడల్స్ ప్రశంసా పత్రాలను కరాటే కింగ్ సినీ నటుడు సుమన్, తెలంగాణ జూడో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జల్లెల శ్రీనివాసరావులు అందజేసి విజేతలను అభినందించినట్లు తెలిపారు.

కోదాడ పట్టణంలో విద్యార్థులకు ఉత్తమ శిక్షణను ఇస్తూ జాతీయస్థాయిలో మెడల్స్ సాధించేందుకు ప్రోత్సహిస్తున్న స్టూడెంట్ కోఫో ఖాన్ క్లబ్ కోదాడ కోచ్మాధవి లత ను ప్రశంసించారు.జాతీయస్థాయిలో మెడల్స్ సాధించిన విద్యార్థులను కోదాడలో పలువురు అభినందించారు.