08-12-2025 12:47:18 AM
మెడల్ విజేతలకు సన్మానం
సనత్‌నగర్ డిసెంబర్ 7 (విజయ క్రాంతి):- జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించే విధంగా మరింత శ్రమించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్ పేట డివిజన్ బల్కంపేటలో గల శ్రీ హనుమాన్ వ్యాయామశాలకు యువకులు, విద్యార్థులు ఇటీవల జరిగిన పోటీలలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు.
ఆదివారం వ్యాయామశాల నిర్వాహకులు రాజు ఆధ్వర్యంలో వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మెడల్స్ సాధించిన వారిని ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
తమ వ్యాయామశాల కు చెందిన గురు వివిధ విభాగాలలో మెడల్స్ సాధించారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు నిర్వాహకుడు రాజు వివరించారు. గత నెల లో జియాగూడాలో నిర్వహించిన రెజ్లింగ్ పోటీలలో మణికంఠ 75 కిలోల విభాగం గోల్ మెడల్, 70 కిలోల విభాగంలో బన్నీ సిల్వర్ మెడల్, అదేవిధంగా పవర్ లిఫ్టింగ్‌లో శ్రవణ్ కుమార్ గోల్ మెడల్ సాధిం చినట్లు తెలిపారు.
మిగిలిన వారు బ్రోన్జ్ మెడల్స్ సాదించారు. తమ వ్యాయామశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తూ, అవసరమైన క్రీడా పరికరాలను అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు వారు కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, అమీర్ పేట డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, కూతు రు నర్సింహ, బలరాం, వనం శ్రీనివాస్, హరిసింగ్ తదితరులు ఉన్నారు.
అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని
సనత్ నగర్ లోని దాసారం బస్తీలో శ్రీనివాస్, కృష్ణ, నవీన్‌ల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. అయ్యప్ప స్వామి కి పూజ నిర్వహించిన అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు.
ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ పార్టీ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాద వ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పుట్టల శేఖర్, బాలరాజ్, కూతు రు నర్సింహ, బలరాం, గుడిగే శ్రీనివాస్ యాదవ్, ఆకుల రాజు తదితరులు ఉన్నారు.