16 May, 2026 | 2:49 AM

తపనతో చదవండి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

16-05-2026 01:29 AM

మహబూబ్ నగర్ టౌన్ మే 15 : ఏదైనా సాధించాలనే తపనతో చదవాలని అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటామని కలెక్టర్  ఖుష్బూ గుప్తా అన్నారు. విద్య వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ’లైబ్రరీ డే’ ను నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్  ఖుష్బూ గుప్తా ప్రారంభించారు.

ఈ సందర్భంగా లైబ్రరీ లోకలెక్టర్ పాఠకులతో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ గ్రంథాలయంలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెట్టు గడ్డ గ్రంథాలయ భవనం ప్రక్కన నిరూపయోగంగా ఉన్న ఎన్ సీ ఎల్ పి భవనాన్ని గ్రంథాలయానికి కేటాయించే విషయం పరిశీలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ప్రవీణ్ కుమార్, జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి మనోజ్ కుమార్, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.