11-11-2025 12:52:40 AM
అధ్యక్షుడిగా సదానందం గౌడ్
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) నూతన కార్యవర్గం ఎన్నికైంది. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వార్షిక సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా జీ.సదానందం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జట్టు గజేందర్, ఆర్థిక కార్యదర్శిగా సయ్యద్ సాబేర్ అలీని ఎన్నుకున్నారు.
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎనిమిది మందిని, ఉపాధ్యక్షులుగా 16 మం దిని, అదనపు ప్రధానకార్యదర్శులుగా ఎనిమిది మందిని, కార్యదర్శులుగా 16 మందిని, ఆర్థిక కమిటీ సభ్యులుగా మరో ఎనిమిది మందిని ఎన్నుకున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు.