calender_icon.png 11 November, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరిద్దాం

11-11-2025 12:53:55 AM

నిర్మల్, నవంబర్  (విజయక్రాంతి): న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 15న నిర్వహించే లోక అదాలత్‌లో జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తులు శ్రీవాణి రాధిక అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ జానకితో కలిసి లోక్ అదాలత్ కేసుల పరిష్కారంపై సమావేశం నిర్వహించి కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. చిన్నచిన్న కేసులని లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని దీనివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఇప్పటివరకు పరిష్కరించిన కేసుల వివరాలు వివరించి పోలీస్ శాఖ సహకారం అందించాలని సూచించారు.