calender_icon.png 21 January, 2026 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టియూటీఎస్ నూతన క్యాలెండరు ఆవిష్కరణ

21-01-2026 07:49:02 PM

నంగునూరు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూటీఎస్ మండల శాఖ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి, హెచ్‌ఎం గొట్టిపర్తి రామస్వామి, ఆంక్షాపూర్ హెచ్‌ఎం నాగార్జున రెడ్డి  పాల్గొని క్యాలెండర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు న్యాయబద్ధమైన పాత పింఛన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కల్లూరి నర్సింలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.