21-01-2026 07:51:38 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ పోచారం 8వ డివిజన్ పరిధి అన్నోజిగూడ లోని గాయత్రి మాత ఆలయంలో 21వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. గాయత్రి మాత ఆలయంలో గోపూజ, ధ్వజారోహణం తత్వనంద మహర్షి ఆధ్వర్యంలో 21వ వార్షికోత్సవ పూజ కార్యక్రమలు జరిగాయి.
అనంతరం అమ్మవారికి జరిగిన కుంకుమార్చనలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డితో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు నర్సింహారావు, ఘట్ కేసర్ రైతు సేవ సహకార సంఘం మాజీ డైరెక్టర్ బోయపల్లి సత్తిరెడ్డి, నాయకులు జితేందర్ నాయక్, కె.ఎం. రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, నాగరాజ్, పురోహితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.