ఎల్లారెడ్డి ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన సబ్ కలెక్టర్ కిరణ్మయి
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ అధికారిగా గత కొద్ది కాలంగా విధులు నిర్వహించిన ఆర్టీవో మన్నే ప్రభాకర్ తన పదవీకాలం ముగియడంతో శనివారం పదవి విరమణ పొందారు. ఎల్లారెడ్డి ఆర్టీవో గా కామారెడ్డి జిల్లా బాన్సువాడ అదనపు కలెక్టర్ కిరణ్మయి(Additional Collector Kiranmayi) శనివారం ఎల్లారెడ్డి ఆర్టీవో కార్యాలయంలో ఎల్లారెడ్డి ఆర్టీవో గా ప్రత్యేక బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం సబ్ కలెక్టర్ కిరణ్మయి ఎల్లారెడ్డి ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన తదనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సబ్ డివిజన్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ... పేద ప్రజలకు ప్రభుత్వం తరఫున అందించే సంక్షేమ పథకాలు తప్పనిసరిగా అందేవిధంగా తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలను ప్రజలకు చేర్చే విధంగా ప్రత్యేక చొరవ చూపుతానని అన్నారు.






