భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
11-08-2026 05:17 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత, ఎస్.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలను భిక్కనూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో భిక్కనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం భిక్కనూర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సుభాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.






