11 August, 2026 | 6:50 PM

చిట్యాలలో స్వర్ణ బిందు ప్రాశన పంపిణీ

11-08-2026 05:44 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ గ్రామంలోని ఈషా పెరాలసిస్ సెంటర్‌ లో ప్రతి పుష్య నక్షత్రం సందర్భంగా 0 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు ఉచితంగా స్వర్ణ బిందు ప్రాశన పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. డాక్టర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. ఆయుర్వేదంలో స్వర్ణ బిందు ప్రాశనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు.

చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు  విశ్వేశ్వర్,  వాసవి, అడ్మినిస్ట్రేషన్ స్వాతి, రాఘవేంద్ర, హనుమంత్ రెడ్డి, అన్విత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.