17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇంటర్ ఫలితాల్లో గురుకుల బాలికల విజయకేతనం..

22-04-2025 05:19 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల(Social Welfare Gurukul Girls College)లో ఇంటర్మీడియట్ ఫలితాలలో విద్యార్థినులు విజయదుందుభి మోగించినట్టుగా కళాశాల ప్రిన్సిపల్ కె రమా కళ్యాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రమా కళ్యాణి మాట్లాడుతూ... ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరములో 35 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా 30 మంది ఉత్తీర్ణులై.... 86%, బైపిసి గ్రూపు నుండి 34 మంది హాజరు కాగా 30 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులై 88%, ఒకేషనల్ విభాగంలో 29 మంది బాలికలు హాజరు కాగా 29 మంది బాలికలు ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించారు.

ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 37 గురు బాలికలు హాజరుకాగా 37 గురు ఉత్తీర్ణులై 100%, బైపిసి గ్రూపులో.. 37 గురు బాలికలు హాజరుకాగా... 35 గురు ఉత్తీర్ణులై.... 94%, ఒకేషనల్ విభాగంలో 24 మంది బాలికలు హాజరు కాగా 23 మంది ఉత్తీర్ణులై.. 96%  ఫలితాలను సాధించడం జరిగిందని తెలియజేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో కళాశాల టాపర్ గా కుమారి ప్రజ్ఞ 468/470 మార్కులు సాధించగా, బైపిసి గ్రూప్ కళాశాల టాపర్ గా కుమారి డి ప్రహస్య 428/440 మార్కులతో, ఒకేషనల్ విభాగంలో.. కళాశాల టాపర్ గా కుమారి శ్రీ వర్ష 493/500 మార్కులతో ఎంపీసీ గ్రూప్  కళాశాల టాపర్ గా  కుమారి చిట్ల అస్మిత 994/1000 మార్కులతో విజయ కేతనం ఎగరవేశారు అని తెలిపారు.

రెండవ సంవత్సరము బైపిసి గ్రూప్ కళాశాల టాపర్ గా కె. అక్షిత 991/1000 మార్కులతో, ఒకేషనల్ విభాగములో కళాశాల టాపర్ గా. సిహెచ్. అక్షయ 987/1000 మార్కులతో విజయకేతనం ఎగరవేశారని తెలియజేశారు..అద్భుతమైన ఫలితాలను సాధించిన టాపర్ లను, ఇతర విద్యార్థినులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే మహేశ్వరరావు, జూనియర్ లెక్చరర్స్ గీతాంజలి, స్వప్న, నిఖిత, శ్యామల, హేమలత, సుజాత లు అభినందించారు.