సరైన మార్గదర్శకత్వంతో విజయం
- మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ
- కరీంనగరలో రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. దేశంలో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రె సోనెన్స్ విద్యాసంస్థలు జగిత్యాల్ రోడ్డు, ఐసీఐసీఐ బ్యాంక్ పక్కన, రేకుర్తి లో ఉన్న ఎలైట్ హోటల్ వేదికగా ’రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ను గురువారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. కరీంనగర్లో ఫౌండేషన్ కో చింగ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించా రు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
విద్యార్థులు చిన్న వయస్సులోనే క్రమబద్ధమైన విద్యా శిక్షణ ద్వారా భవిష్యత్తు పోటీ పరీక్షలకు బలమైన పునాదిని ఏర్పరచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా మాట్లాడుతూ.. అనుభవ జ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెన్స్ కట్టుబడి ఉందన్నారు.






