విజయవంతంగా ‘గ్లోబల్ రాజస్థాన్ అగ్రిటెక్ మీట్ 2026’
హైదరాబాద్, మే 2026: వ్యవసాయ ఆవిష్కరణలు, వ్యవసాయ సాంకేతిక పెట్టుబడులు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు రాజస్థాన్‌ను ఒక ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఒక ముందడుగు వేస్తూ, రాజస్థాన్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ - రాజస్థాన్ ఫౌండేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కి) సహకారంతో ‘గ్లోబల్ రాజస్థాన్ అగ్రిటెక్ మీట్(గ్రామ్)–2026’ శీర్షికన హైదరాబాద్ లో పెట్టుబడిదారుల సదస్సును విజయవంతంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల శాఖ మంత్రి జోరారామ్ కుమావత్, సహకార శాఖ సహాయ మంత్రి గౌతమ్ కుమార్ డాక్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శిఖర్ అగర్వాల్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి మంజు రాజ్‌పాల్, రాజస్థాన్ ఫౌండేషన్ కమిషనర్ డాక్టర్ మనీషా అరోరా, వ్యవసాయ కమిషనర్ నరేష్ కుమార్ గోయల్, ఉద్యానవన కమిషనర్ శ్వేతా చౌహాన్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, ఫిక్కీ జాతీయ వ్యవసాయ కమిటీ సహ-అధ్యక్షులు సుబ్రతో గీస్, రాజస్థాన్ ఫౌండేషన్ హైదరాబాద్ విభాగం అధ్యక్షులు పవన్ బన్సల్ , భగవతి బల్దేవా సహా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు;లు హాజరయ్యారు.
హైదరాబాద్ లో జరిగిన ఈ పెట్టుబడిదారుల సదస్సులో రూ. 200 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు జరిగాయి. వ్యవసాయం, సాంకేతికత, ఆవిష్కరణలు, పాడి పరిశ్రమ, డ్రోన్ సాంకేతికత, డిజిటల్ వ్యవసాయం, పెట్టుబడి భాగస్వామ్యాల రంగాలలో రాజస్థాన్‌కు ఉన్న అపారమైన సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడమే ఈ సదస్సు యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ భజన్ లాల్ శర్మ మాట్లాడుతూ , “రాజస్థాన్ సాంప్రదాయ వ్యవసాయం నుండి వేగంగా సాంకేతికత, ఆవిష్కరణల-ఆధారిత, పెట్టుబడి-సామర్థ్యం గల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా అగ్రిటెక్, ఆహార శుద్ధి, డిజిటల్ వ్యవసాయం, వ్యవసాయ మౌలిక సదుపాయాలలో అందుబాటులో ఉన్న విస్తారమైన అవకాశాలను అన్వేషించవలసిందిగా మేము పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు ముందు, జైపూర్, న్యూఢిల్లీ, బెంగళూరు మరియు అహ్మదాబాద్‌లలో ఇప్పటికే విజయవంతమైన పెట్టుబడిదారుల సమావేశాలు నిర్వహించారు. కాగా రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా అనేక ఇతర ప్రధాన నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.






