15 June, 2026 | 11:30 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన సుడా చైర్మన్

29-10-2025 04:59 PM

లెక్చరర్లకు తగు సూచనలు చేసి విద్యార్థినులకు భరోసా..

ముకరంపురా (విజయక్రాంతి): గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటన దృష్ట్యా కరీంనగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి లెక్చరర్లకు సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించి విద్యార్థినులకు భరోసా కల్పించారు. కళాశాలలో వసతులపై ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సాయంత్రం విద్యార్థినులు ఇంటికి వెళ్లే సమయంలో మెయిన్ గేటు వద్ద ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు సుడా చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు పోలీసులు మెయిన్ గేటు వద్ద పర్యవేక్షణ చేసి విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. డిఈవో గంగాధర్, ప్రిన్సిపాల్ నిర్మల, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, లెక్చరర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.