calender_icon.png 30 October, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ నిబంధనల మేరకే ఎమ్మార్పీ ధరలకు వ్యాపారాలను నిర్వహించాలి

29-10-2025 05:01:44 PM

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో నూతనంగా 2025-27 రెండు సంవత్సరాలకి ఇటీవల కాలంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా లక్కీ డ్రా ద్వారా మరిపెడ మున్సిపాలిటీలోని ఐదు షాపులను దక్కించుకున్న వ్యక్తులు మద్యం అమ్మకాలను ఎమ్మార్పీ ధరలకు ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే వ్యాపారాలను కొనసాగించాలని, షాపులు దక్కించుకున్న యజమానులు లేదా షాపులు కొనుగోలు చేసిన యజమానులు ఆ మొత్తాన్ని రాబట్టుకోవడానికి ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి అధిక ధరలకు మద్యం విక్రయించి, ఈ ప్రాంతంలో వ్యాపారాలను కొనసాగించాలని అనుకొంటే ప్రజలను ఆర్థిక దోపిడీకి గురిచేసినట్లయితే ప్రజా పోరాటాలను కొనసాగించవలసి వస్తుందని కాబట్టి వ్యాపారస్తులు ఈ రెండు సంవత్సరాల కాలంలో సామాన్యులకు అందుబాటు ధరల్లో మద్యం అమ్మకాలు చేపట్టాలని  సిపిఐ మరిపెడ మండల సమితి తరపున వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న, సహాయ కార్యదర్శి అబ్దుల్ రషీద్, నారాయణ ,అంజి ,రవి తదితరులు పాల్గొన్నారు.