8 April, 2026 | 5:05 AM

ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ

06-02-2026 12:18 AM

సూర్యాపేట, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : నాగారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం  ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాకు రిజిస్టర్ ను పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. షాపులో నిల్వ ఉన్న యూరియా బస్తాలు, ఇతర ఎరువుల వివరాలను ఏవో కృష్ణ కాంత్ ను అడిగి తెలుసుకున్నారు.

స్టాక్ రిజిస్టర్లు 430 యూరియా నిల్వలు ఉన్నట్లుగా నమోదు చేయడం గమనించిన కలెక్టర్  యూరియా నిల్వలు స్వయంగా  పరిశీలించారు, కొనుగోలు యాప్ ద్వారా రైతులకు యూరియా కొనుగోలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఈ యాప్ వల్ల రైతులకు  లాభదాయకంగా ఉందా లేదా అలాగే యూరియా సరఫరా గురించి డీలర్ ఉపేందర్ ను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఎరువులు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈయన వెంట పలువురు రైతులు ఉన్నారు.