06-02-2026 12:19:25 AM
కొత్తపల్లి, ఫిబ్రవరి 5(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండవ రోజున యూ నివర్సిటీ ఆరట్స్ అండ్ లా కళాశాల సెమినార్ హల్ లో ‘భారత ఆర్థిక వ్యవస్థపై కృత్రి మ మేధస్సు యొక్క ప్రభావం ‘అనే అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి సదస్సు ముగిసింది. రెండవ రోజు సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, ఉపకులపతి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ గారు మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు అనేది యంత్ర అభ్యాస విధానంతో అనుసంధానం చేసుకొని తన యొక్క పనులను చేసుకుంటుందని, ఇంజనీరింగ్ విభా గంలో కృత్రిమ మేధస్సును విరివిగా ఉపయోగిస్తున్నారని మరియు ఖగోళ శాస్త్రంలోని సర్వేల నుండి సమాచారాన్ని కృత్రిమ మేధస్సు విశ్లేషిస్తుందని వివరించారు.
విశిష్ట అతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్య, వైద్య, పర్యాటక మరి యు అన్ని రంగాలలో కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం ద్వారా దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థలో వద్ది రేటును పెంచవచ్చని వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ రిజిస్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఇంజనీరింగ్, నానో రంగంలో ఎన్నో మా ర్కులు ప్రవేశ పెట్టవచ్చని విశ్లేషించారు.
మరొక గౌరవ అతిధి ప్రొఫెసర్ సురేష్ లాల్, డైరెక్టర్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కాకతీయ విశ్వవిద్యాలయం మాట్లాడుతూ ము ఖ్యంగా భారత వ్యవసాయ రంగంలో ప్రస్తు తం విత్తన ఉత్పత్తి నుండి కలుపుతీయుట ,పురుగుమందులు చల్లుట కృత్రిమ మేధస్సును ఉపయోగించి చేస్తున్నారని వాతావర ణం లోని మార్పులను కృత్రిమ మేధస్సు ద్వారా అంచనా వేస్తున్నారని పలు అంశాల పై ముగింపు ఉపన్యాసం చేశారు.
పరిశోధనా రంగంలో కృత్రిమ మేధస్సును ఉప యోగించి ఎన్నో ఫలితాలు సాధించవచ్చు అని డాక్టర్. మహ్మద్ జాఫర్ జరి, డైరెక్టర్ రీ సెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ వివరించారు. సెమినార్ కన్వీనర్ మరియు అర్థశాస్త్ర విభాగపు అధిపతి డాక్టర్ కే శ్రీవాణి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు దాని ప్రభావం అ నే అంశంపై రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మరియు రాష్ట్రాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి వచ్చిన అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థులు మొత్తంగా 60 పరిశోధన పత్రాలను సమర్పించారని ము ఖ్యమైన పరిశోధన పత్రాలను జర్నల్స్ రూపంలో ముద్రించి విడుదల చేశామని వి వరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాల ఆరట్స్ అండ్ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. పద్మావతి ప్రొ. ఏం. వరప్రసాద్, ప్రొ. సూరేపల్లి సుజాత, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్. మహ్మద్ అబ్రహర్ బాకీ, డాక్టర్ .డి హరి కాంత్ డాక్టర్. ఉమేరా తస్లీమ్, డాక్టర్. ము నావర్, డాక్టర్ విజయ్ ప్రకాష్, డాక్టర్. డి.సత్యనారాయణ, డాక్టర్. విద్యాసాగర్, అధ్యాపకులు, పరిశోధకులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.