10 April, 2026 | 1:50 AM

ముగిసిన సుహాస్ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నీ

04-11-2025 12:00 AM

సికింద్రాబాద్, నవంబర్ 3: సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌సీ ఇండోర్ బ్యాడ్మింటన్ అకాడ మీలో సుహాస్ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 ఉత్సాహంగా ముగిసింది. ఈ టోర్నీలో   పలువురు యువ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సత్తా చాటారు. బాలుర , బాలికల అండర్ అండర్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

సింగి ల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాల్లో యువ షట్లర్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. సుహాస్ స్మారకార్థంగా నిర్వహించిన ఈ టోర్నీకి విశేష స్పందన వచ్చినట్టు ఆర్గనైజర్స్ తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పీసీఎస్‌రావు ఈ టోర్నీని విజయవంతంగా నిర్వ హించారు.

ముగింపు వేడుకలకు దస్‌పల్లా హోటల్స్ ఎండీ జి.వెంకటకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. భవిష్యత్తుల్లో మరింత మంది క్రీడాకారులు తెలంగాణ నుంచి వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులు లక్ష్మణ యువిఎన్ బాబు, వంశీ, శ్రీనివాసరావు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.