calender_icon.png 22 January, 2026 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు

20-09-2024 12:22:01 AM

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీవీఎస్ చౌదరి

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో 6 వేల కంటే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెలగపూడి వీవీఎస్ చౌదరి అన్నారు. రైతుల ఆత్మహత్యలు కేసీఅర్ ప్రభుత్వం చేసిన హత్యలేనని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుం బం రైతుబంధు పథకంతో భూస్వాములకు, ఫామ్‌హౌస్ ఓనర్లకు సాగించిన డబ్బు పందేరం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు తెలం గాణ రైతన్నలు  ముట్టడించా ల్సింది తెలంగాణ భవన్, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ను అన్నారు. దళితుడైన ఉప ముఖ్య మంత్రి నివాసముండే ప్రగతి భవన్‌ను ముట్ట డించమని రైతులకు హరీశ్‌రావు పిలు పునివ్వడం దొరల దురహంకారం ఏ మాత్రం తగ్గలేదనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.