29 April, 2026 | 10:46 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం

29-04-2026 09:36 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): సనత్‌నగర్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంప్ నేడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థులు విజయ్ ప్లే గ్రౌండ్ నుంచి మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తూ క్యాంప్ ప్రాంగణానికి చేరుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పిల్లలు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు.క్యాంప్‌లో కోచ్ రాజ్ కిరణ్ ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ అందించనున్నారు. ప్రాథమిక నైపుణ్యాల నుంచి ప్రొఫెషనల్ స్థాయి వరకు శిక్షణ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు, స్థానికులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.