వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
కేసముద్రం, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, శిబిరంలో క్రీడల పట్ల మెలకువలు నేర్చుకొని క్రీడాకారులుగా రాణించేందుకు కృషి చేయాలని రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి కోరారు.
కేసముద్రం పీఎం శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కేసముద్రం సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారుల సౌజన్యంతో, ఏర్పాటుచేసిన వేసవి బాస్కెట్బాల్ శిక్షణ శిబిరాన్ని రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఆర్.రమేష్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ కమిటీ మెంబర్ రావుల మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ కేసముద్రం బాస్కెట్బాల్ క్రీడాకారులకు పుట్టినిల్లని, ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి వివిధ ఉద్యోగాలలో స్థిరపడ్డారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని వర్ధమాన క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. ఆర్టిఏ మెంబర్ రావుల మురళి మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరం జూనియర్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, ఎక్కువమంది ఈ శిబిరంలో పాల్గొని, మంచి క్రీడా నైపుణ్యాలను పెంపొందించు కోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారుడు ఎన్.రవి, మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్ ఆగే రాము, రాంబాబు, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్ము రాజేందర్, సీనియర్ క్రీడాకారులు ఏం యాకయ్య, పి.యాకయ్య, ఎండి ఫరీద్,ఎం, వెంకన్న, ఎం. హరీష్, డాక్టర్ ఎన్. అశోక్, బి.రమేష్, ఎస్.వేణు, సిహెచ్. ఎలేందర్, ఎం.యాకయ్య, ఈ. బిక్షపతి, ఆర్.రాజు, ఎన్. వెంకన్న, ఎస్. ప్రవీణ్, ఎం. సుధాకర్, రాకేష్, యశ్వంత్, సందీప్, పి.నాగరాజు, బధ్యా నాయక్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు.




