14 April, 2026 | 4:55 PM

కట్టలన్‌లో సునీల్

08-06-2025 12:00 AM

బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘మార్కో’ విజయం తర్వాత క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత షరీఫ్ మహమ్మద్.. తన తదుపరి ప్రాజెక్ట్‌గా ‘కట్టలన్’ను ప్రకటించారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హై-యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ప్రముఖ నటుడు ఆంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు పౌల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మలయాళ చిత్రంలో కీలక పాత్రలో సునీల్ నటిస్తున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు సునీల్ స్టులిష్ లుక్‌లో కనిపిస్తున్న అనౌన్స్‌మెంట్ పోస్టర్ పంచుకున్నారు. ఈ సినిమాకు ‘కాంతార2’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.