14 April, 2026 | 1:19 PM

Breaking News

అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •   ఒంగోలు దారుణ ఘటన: బతికుండగానే తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు!   •  

అతీంద్రియ శక్తుల ఉల్క రహస్యమేంటి?

08-06-2025 12:00 AM

యంగ్ హీరో ఆదిసాయికుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.

అంతరిక్షం నుంచి ఏదో ఒక అతీంద్రియ శక్తి ఉన్న ఉల్క, రాయి లాంటిది ఓ గ్రామంలో పడటం.. దాని ప్రభావంతో ఊర్లోని జనాలు చనిపోవడం, వింతగా ప్రవర్తించడం జరుగుతుంటుంది. దాన్ని ఛేదించేందుకు హీరో రావడం..

ఓ ఊరితో పోరాటం చేయడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.