29 August, 2026 | 12:37 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

సినీరంగ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

08-06-2025 12:00 AM

ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాలు టాలీవుడ్‌ను గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తక్షణ కర్తవ్యంగా పరిశ్రమ ప్రముఖులు దిద్దుబాటు చర్యలకు సిద్ధమయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తాజాగా ప్రత్యేక కమిటీ ఏర్పాటయ్యింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతా ఏకతాటిపైకి వచ్చారు. ఈ మూడు సెక్టార్ల నుంచి 30 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్‌భూషణ్ ఈ కమిటీకి చైర్మన్‌గా, ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. నిర్మాతల విభాగం తరఫున దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, సీ కల్యాణ్, రవికిశోర్, రవిశంకర్, దానయ్య, స్వప్నదత్, సుప్రియ ఇందులో సభ్యులుగా ఉన్నారు.

ఇటీవల మే 30న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ వివరాలను బాధ్యులు వివరించారు.