బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సునీల్‌రావు
12-03-2026 01:44 AM
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వై సునీల్‌రావును నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఉత్తర్వులిచ్చారు. కరీంనగర్ మాజీ మేయర్ అయిన సునీల్‌రావు ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతోపాటు తనకు అండగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సునీల్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ ప్రవీణ్‌రావు ఇతర నాయకులందరి సహకారంతో పార్టీలో సైనికుడిగా పని చేస్తానని చెప్పారు.




