23 May, 2026 | 1:53 AM

ఉప్పల్‌లో సన్‌రైజ్

23-05-2026 12:54 AM
  1. ఆర్సీబీపై విజయం
  2. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ విధ్వంసం
  3. గెలిచినా మూడో స్థానమే

ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం తో ముగించింది. హోం గ్రౌండ్‌లో మరోసారి బ్యాట ర్లు చెలరేగిపోయిన వేళ డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరును చిత్తు చేసింది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ విధ్వం సం సృష్టించగా.. బౌలింగ్ లోనూ రాణించింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచినా రన్ రేట్ లేకపోవడంతో మూడో స్థానానికే పరిమితమైంది. 

హైదరాబాద్, మే 22 : సొంతగడ్డపై చివరి మ్యా చ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటిం గ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడమే లక్ష్యంగా చెలరేగిపోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, హెడ్ రెచ్చిపోయారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు కేవలం 4 ఓవర్లలోనే 45 పరు గులు జోడించారు. హెడ్ (26) ఔటైనా.. అభిషేక్, ఇషాన్ కిషన్ మరింత దూకుడుగా ఆడారు. ఆర్సీబీ బౌలర్లను ఎడాపెడా బాదేశారు. వీరిద్దరూ కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులు జోడించారు.

అభిషేక్ శర్మ ఈ సీజన్‌లో మరో హాఫ్ సెంచరీ సాధించాడు. 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన అభిషేక్ రెండో వికెట్ గా వెను దిరిగాడు. అయితే ఫామ్‌లో ఉన్న క్లాసె న్, ఇషాన్ కిషన్‌తో కలిసి స్కోరు బోర్డు పరిగెత్తించాడు. వీరిద్దరూ కేవలం 48 బంతుల్లోనే 113 ప రుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెం చరీలు పూర్తి చేసుకున్నా రు. క్లాసెన్ 24 బంతు ల్లో 51 (2 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులకు ఔటవగా..తర్వాత క్రీజులోకి వస్తూనే నితీశ్ కుమార్ రెడ్డి వరుసగా రెండు సిక్స ర్లు బాదాడు.

అటు ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 రన్స్‌కు చివరి బంతికి ఔటయ్యాడు. నితీశ్ రెడ్డి 12 బంతుల్లో 29 (1 ఫోర్, 3 సిక్సర్లు) నాటౌట్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లో భువనేశ్వర్, హ్యాజిల్ వుడ్‌తో సహా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. రసిక్ సలామ్ దార్ 2, కృనాల్, సు యాశ్ శర్మ ఒక్కో వికె ట్ పడగొట్టారు. తర్వాత ఛేజిం గ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా దూకుడుగానే ఆడింది. ఓపెనర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ రెచ్చిపోయాడు. బౌండరీలు, సిక్సర్ల వ ర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులకు ఔ టయ్యాడు.

తొలి వికెట్‌కు వెంకటేశ్ అయ్యర్, కోహ్లీ 4.3 ఓవర్లలో 60 పరుగులు జో డించారు. అయితే కోహ్లీ(15) నిరాశపరిచాడు. కాసేపటికే పడిక్కల్ (21) కూడా వెనుదిరగడంతో ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పటిదార్, కృనాల్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 84 పరుగుల పార్టనర్ షిప్ నెలకొ ల్పారు. సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో ఆర్సీబీ టాప్ ప్లేస్‌లో నిలవడమే టార్గెట్‌గా ఆడింది. 178 పరుగుల స్కోరును దాటడంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. చివరికి ఆర్సీబీ 4 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా సన్‌రైజర్స్ మూడో స్థానానికే పరిమితమై ఎలిమినేటర్ ఆడబోతోంది. అటు ఓడినా టాప్ ప్లేస్ నిలుపుకున్న బెంగళూరు క్వాలిఫైయర్ 1లో గుజరాత్‌తో తలపడుతుంది.

స్కోరు బోర్డు

హైదరాబాద్ ఇన్నింగ్స్ : 255/4 ( ఇషాన్ కిషన్ 79, అభిషేక్ శర్మ 56, క్లాసెన్ 51, రసిక్ సలామ్ దార్ 2/52, కృనాల్ పాండ్యా 1/24 )

బెంగళూరు ఇన్నింగ్స్ : 200/4 ( పటిదార్ 56, వెంకటేశ్ అయ్యర్ 44, కృనాల్ పాండ్యా 41 నాటౌట్,  మలింగ 2/33, హెడ్ 1/7 )