11 August, 2026 | 10:03 AM

సూపర్ యోధ.. తేజ సజ్జా

24-08-2024 12:47 AM

‘హను సూపర్ హీరోగా మెప్పించిన యువ కథానాయకుడు తేజ సజ్జా తన తర్వాతి చిత్రం ‘మిరాయ్’తో అలరించనున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ -అడ్వెంచర్‌లో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి శుక్రవారం ఓ పోస్టర్ విడుదలైంది. తేజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో ఆయన.. మండుతున్న ఐరెన్ రాడ్‌ను పట్టుకుని పైకి చూస్తూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 8 భాషల్లో 2025, ఏప్రిల్ 18న 2డి, 3డి వెర్షన్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.